Amalapuram: అమలాపురం వాగ్దేవి స్కూల్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం!

Amalapuram: అమలాపురం వాగ్దేవి పాఠశాలలో గిడుగు రామ్మూర్తి జయంతి. తెలుగు కవుల వేషధారణతో అలరించిన విద్యార్థులు, బహుమతుల ప్రదానం.

SURESH, AMALAPURAM
Published on: 29 Aug 2026 7:33 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం వాగ్దేవి స్కూల్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం!

Amalapuram: అమలాపురం స్థానిక వడ్డిగూడెంలోని శ్రీ వాగ్దేవి పాఠశాలలో ఆగష్టు 29 వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని,వారం రోజుల ముందు నుంచే పాఠశాల విద్యార్థులకు తెలుగు భాషపట్ల ఆసక్తిని,మక్కువను కలిగించే విధంగా వివిధ రకాల పోటీలను నిర్వహించారు.

తెలుగు వైభవాన్ని దశదిశల వ్యాపించేల వినూత్న తరహాలో విద్యార్థులకు పోటీలను నిర్వహించారు.ప్రాచీన, ఆధునిక కవుల వేషధారణతో నిర్వహించిన కవి సమ్మేళనం ఆద్యంతం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. కవిత్రయం,అష్టదిగ్గజ కవులు, అభ్యుదయ కవులేగాక కవయిత్రి మొల్ల, తరిగొండ వెంగమాంబ,తిమ్మక్క మొదలు నేటి మహిళా అవధాని బులుసు అపర్ణగారి వరకు,ఏ శతాబ్ద తెలుగు కవులను వదలకుండా వాగ్దేవి ప్రాంగణమంతా కవులతో నిండు ముత్తెదువులా మెరిసి మురుస్తూ శోభిల్లింది.

తమ విద్యార్థులు ఆధునిక విద్యలోనే కాక మాతృభాషలో కూడా మణిపూసలేనని మరొకసారి నిరూపించారని పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శ్రీరామచంద్రమూర్తి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇంటగెలిచి రచ్చ గెలవాలనే దానికి నిదర్శనం తమ విద్యార్థులేనని కొనియాడారు.పాఠశాల డైరక్టర్ పరసా భరత్ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో విజేతలైన విద్యార్ధులకు బహుమతులను అందజేస్తూ అభినందించారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story