Amalapuram: కోనసీమ జిల్లాలో జాతీయ రహదారి పనులపై కలెక్టర్ సమీక్ష!

Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 216 జాతీయ రహదారి వెంబడి విద్యుత్ వైర్ల ఎత్తును 12 మీటర్లకు పెంచాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు.

PRABHU, RAZOLE
Published on: 27 May 2026 7:13 PM IST
Amalapuram
X

Amalapuram: కోనసీమ జిల్లాలో జాతీయ రహదారి పనులపై కలెక్టర్ సమీక్ష!

Amalapuram: డాక్టర్.. బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 216 జాతీయ రహదారి వెంబడి పాశర్లపూడి,శివకోడు గ్రామాల వద్ద ఆరు మీటర్ల ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లను 12 మీటర్లు ఎత్తుకు పెంచేందుకు ఏపీ ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు జాతీయ రహదారుల ఇంజనీర్లు,ఆర్డీవో, ట్రాన్స్కో ఇంజనీరులు తదితరులతో రహదారి వెంబడి ఉన్న విద్యుత్ టవర్ల ఎత్తు పెంచడంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 25 వ తేదీ నాటికి చించినాడ బ్రిడ్జి పనులు పూర్తిచేసి జూన్ 26వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని, ఈ లోపుగా విద్యుత్ వైర్లు ఎత్తు పెంచే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. 216 జాతీయ రహదారి వెంబడి సుమారు 8 ట్రాన్స్కో టవర్లు ఎత్తు పెంచాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి రహదారి వెంబడి రాకపోకలకు తగు చర్యలు గైకొనాలన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి, ఆర్డిఓ జి మమ్మీ, ఆర్ అండ్ బి జాతీయ రహదారుల డివిజనల్ ఇంజనీర్ నిక్కీ, ట్రాన్స్కో ఈ ఈ శ్రీనివాస రావు,ఎన్ హెచ్ ఏఈ ఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story