Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్.. ప్రజా అర్జీల స్వీకరణ!

Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ (PGRS) కార్యక్రమం జరిగింది.

PRABHU, RAZOLE
Published on: 25 May 2026 6:38 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్.. ప్రజా అర్జీల స్వీకరణ!

Amalapuram: ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టీ సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదే శించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి సుమారుగా 250 ఆర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే అర్జీలు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి, వారికి న్యాయం చేయడమే జిల్లా యంత్రాంగం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నాన్చుడు ధోరణి లేకుండా, నిర్దేశిత కాలపరిమితి లోగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు .కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, అవసరమైన చోట అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్య తీవ్రతను బట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాస్థాయి అధికారులు నిర్దేశ గడువులోగా అర్జీల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని, అర్జీదారులకు సకాలంలో సమాచారం అందిస్తూ పార దర్శకత పాటించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదులు పౌర సేవల కోసం ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియా దేవి ఆదేశించారు.

శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి వచ్చిన ప్రతి ఫిర్యాదును సమన్వయంతో పరిష్కరించాలన్నారు. పిజిఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కారంలో హేతుబద్ధత కలిగి ఉండాలని తెలిపారు. అర్జీలను సమగ్రంగా పరిశీలించి, వాటికి తగిన పరిష్కార మార్గాలను త్వరిత గతిన అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, సమర్థత పాటించడం అత్యంత ముఖ్య మని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో డిఆర్వో వి సుబ్బారావు, డ్వామా పిడి రాంబాబు, స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం నోడల్ అధికారి విజయలక్ష్మి, డి ఎల్ డి వో వేణుగోపాల్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story