Razole: శివకోటి హిందూ సమాఖ్య ఆధ్వర్యంలో పల్లకీ సేవ

Razole: రాజోలు మండలం శివకోటిలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

PRABHU, RAZOLE
Published on: 22 April 2026 12:12 PM IST
Razole
X

Razole: శివకోటి హిందూ సమాఖ్య ఆధ్వర్యంలో పల్లకీ సేవ

Razole: రాజోలు మండలం శివకోటి శివాలయంలో శివకోటి హిందూ సమాఖ్య ఆధ్వర్యంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన స్వామివారి పల్లకీ సేవ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఊరేగింపు ప్రధాన వీధుల గుండా సాగింది.

అనంతరం ఆలయ ప్రాంగణంలో శంకర భగవత్పాదుల విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి జీవిత చరిత్రపై ప్రవచన కార్యక్రమం చేపట్టారు. లలితా సహస్ర పారాయణ మండలి సభ్యులచే జరిగిన లలితా పారాయణం, కనకధారా స్తోత్ర పఠనం మరియు 'భజగోవిందం' కీర్తనల ఆలాపన భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు స్వామివారి చరిత్ర పుస్తకాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమం చివరలో తీర్థప్రసాద వితరణ జరిగింది. ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు, హైందవ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని శంకరాచార్యుల కృపకు పాత్రులయ్యారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story