Rayachoti: లక్కిరెడ్డిపల్లిలో ఆత్మహత్యాయత్నం!

Rayachoti: అన్నమయ్య జిల్లాలో విషాదం: కుటుంబ కలహాలతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన జడ్పీఎన్ఎఫ్ ఉద్యోగి హరికృష్ణ. పరిస్థితి విషమం, కడప రిమ్స్‌కు తరలింపు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 14 Aug 2026 8:08 AM IST
Rayachoti
X

Rayachoti: లక్కిరెడ్డిపల్లిలో ఆత్మహత్యాయత్నం!

Rayachoti: లక్కిరెడ్డిపల్లి మండలంలోని బీ యర్రగుడి గ్రామం బిఏ నాగిరెడ్డి పల్లెకు చెందిన హరికృష్ణ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో గురువారం రాత్రి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

స్థానికుల వివరాల మేరకు రాయచోటి వేంపల్లి మార్గమధ్యంలోని దాసిరెడ్డి మిట్ట సమీపంలో బిఏ నాగిరెడ్డిపల్లి కి చెందిన జడ్పీఎన్ఎఫ్ ఉద్యోగి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని కాలిపోతున్న తరుణంలో అటువైపు వెళుతున్న వాహనదారులు, స్థానికులు గమనించి 108 కు సమాచారం అందించి హుటాహుటిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

హరికృష్ణ రామాపురం మండలం కల్పనాయన్ చెరువు పరిధిలో జడ్పీఎన్ఎఫ్ ఎఫ్ఎంటిగా పనిచేస్తున్నట్లు తెలిపారు.ఈ మేరకు మెరుగైన వైద్యం కొరకు కడప రిమ్స్కు తరలించినట్లు అక్కడ సిబ్బంది తెలిపారు. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లె పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story