Rayachoti: రాయచోటిలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు ఉధృతం!

Rayachoti: రాయచోటిలో YSRCP ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ఉధృతమయ్యాయి. ఎన్నికల హామీలు, DSC అక్రమాలపై విచారణ, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 7 Aug 2026 3:42 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు ఉధృతం!

అన్నమయ్య జిల్లా ​రాయచోటి:

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అలాగే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఈ ఆందోళన బాట పట్టాయి.అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ నేతృత్వంలో ఈ రిలే నిరాహార దీక్షలు ఉధృతంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలొ ధ్వజమెత్తారు.డీఎస్సీ అక్రమాలపై విచారణ: డీఎస్సీ (DSC) ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మహమ్మద్ ఖాన్ విమర్శించారు. దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగ భృతి: ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని, వెంటనే యువతకు భృతి చెల్లింపులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ (విద్యా దీవెన, వసతి దీవెన) బకాయిలను వెంటనే కళాశాలలకు లేదా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాయచోటి ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, రాయచోటిని జిల్లా కేంద్రంగా పునరుద్ధరించాలని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలు తగవని ఆయన హెచ్చరించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని మహమ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్లను నెరవేర్చకపోతే, రాబోయే రోజుల్లో ఎంపీ మిథున్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డిల నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు, మైనార్టీ సెల్ ప్రతినిధులు, కార్యకర్తలు, యువకులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు....

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story