Kadapa: డీఎస్సీ అక్రమాలు రద్దు చేయాలి: మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా!

Kadapa: కడప వన్ టౌన్ సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 6 Aug 2026 5:49 PM IST
Kadapa
X

Kadapa: డీఎస్సీ అక్రమాలు రద్దు చేయాలి: మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా!

కడప: నగరంలోని వన్ టౌన్ సర్కిల్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాలంటరీ విభాగం, పబ్లిసిటీ విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్ష ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

ప్రధాన డిమాండ్లు:

* DSC నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను రద్దు చేసి పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి.

* ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

* నిరుద్యోగ భృతిని పునరుద్ధరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.

ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. మాజీ మేయర్ పాకా సురేష్, సీఈసీ సభ్యులు కే. సురేష్ బాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story