Proddatur: డీఎస్సీ అక్రమాలపై దమ్ముంటే సీబీఐ విచారణ వేయాలి!
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు దీనిపై సీబీఐ విచారణకు బంగారు మునిరెడ్డి డిమాండ్ చేశారు.
Proddatur: డీఎస్సీ అక్రమాలపై దమ్ముంటే సీబీఐ విచారణ వేయాలి!
Proddatur: డిఎస్సి నియామాకల్లో అవకతవకలు జరగాయంటూ నేడు ప్రొద్దుటూరు లో వైసీపీ నేతల నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. కూటమి ప్రభుత్వనికి డీఎస్సీ నియామకాల పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలి.. ప్రొద్దుటూరు వైసీపీ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ బంగారుమునిరెడ్డి.
ప్రొద్దుటూరులో డీఎస్సీ నియామకల్లో అవకతవకలు జరిగాయంటూ నేడు వైసీపీ నేతలు నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వెల్లువెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు దమ్ముంటే కూటమి ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ నేత బంగారుమునిరెడ్డి డిమాండ్ చేశారు.
డీఎస్సీ ఎంపికల్లో అక్రమాలు జరిగాయన్న విమర్శల నేపథ్యంలో, సమగ్ర విచారణ ద్వారా మాత్రమే నిజానిజాలు బయటకు వస్తాయని నేతలు స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటూనే, నిజమైన అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడం, మండిపడ్డారు.
అర్హత కలిగిన అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా తగిన న్యాయం చేయాలి. ప్రభుత్వం వెంటనే అభ్యర్థులతో చర్చలు జరిపి, ఈ సమస్యపై ఒక స్పష్టమైన హామీని ఇవ్వాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి అభ్యర్థులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.




