Rayachoti: కూటమి ప్రభుత్వంపై గడికోట ఆగ్రహం నిరసనలపై ఆంక్షలా!
Rayachoti: శాంతియుత నిరసనలను పోలీసులు అడ్డుకోవడం విడ్డూరమని వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ఆంక్షలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rayachoti: కూటమి ప్రభుత్వంపై గడికోట ఆగ్రహం నిరసనలపై ఆంక్షలా!
Rayachoti: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు ఉందని, ఆ హక్కును కాలరాసే విధంగా పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదన్నారు.
డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు, నిరుద్యోగ భృతి అమలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, రాయచోటిని జిల్లా కేంద్రంగా పునరుద్ధరించాలన్న డిమాండ్లతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన తమ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ర్యాలీలో కేవలం 20–30 మంది మాత్రమే వెళ్లాలని ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్యానికి అవమానకరమని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించడం లేదని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.
సాయికృష్ణ అనే వ్యక్తి హత్యకు గురైన ఘటనలో కూడా కుటుంబ సభ్యులు తమకు అప్పగించాలని కోరిన బూడిదను కూడా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.క్రాంతి కుమార్ తో పాటు పలువురు దళితులు, మైనారిటీలు ప్రభుత్వ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయన్నారు .కాకినాడలో ప్రియాంకను కారుతో గుద్ది చంపారన్నారు.
రాష్టంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. పోలీసులు శాంతిభద్రతలను కాపాడడంపై దృష్టి పెట్టకుండా శాంతియుత నిరసన కార్యక్రమాలను చేపట్టేవారిని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే పోలీసుల నుంచి ఆంక్షలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమిటని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
20–30 మంది మాత్రమే ర్యాలీలో వెళ్లాలి.. అంతకుమించి వెళ్లకూడదు అంటూ పోలీసులు ఆంక్షలు విధించడం ఏ న్యాయమని నిలదీశారు. ప్రజల సమస్యలను ప్రజల మధ్యకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.అధికార పార్టీ నేతలు నిర్వహించే ప్రైవేట్ కార్యక్రమాలకు అధికారులు, పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.
అధికార పార్టీ నేతలు ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహిస్తే ఎస్పీ స్వయంగా విందుకు హాజరై బందోబస్తు నిర్వహిస్తారని, అదే ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై శాంతియుత కార్యక్రమాలు చేపడితే ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నించారు.ప్రజల సమస్యలను వినిపించే గొంతులను అణచివేయడం, నిరసనలకు అనుమతులు నిరాకరించడం, కేసుల పేరుతో బెదిరించడం ప్రజాస్వామ్యంలో ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.
మహిళలకు నెలకు రూ1500/-,నిరుద్యోగ భృతిరూ 3 వేలు,50 ఏళ్లకు పెన్షన్లు తదితర హామీలను అమలుచేయకుండానే అన్నీ చేసేసామని కూటమి నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.అప్పులను విపరీతంగా తెచ్చి ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారన్నారు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దెబ్బతిందన్నారు.




