Duvvuru: ఉపాధ్యాయులకు విద్యాబోధనపై డీఈవో కీలక సూచనలు!
Duvvuru: దువ్వూరు మండలంలోని పుల్లారెడ్డిపేట, దువ్వూరు జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి (DEO).
Duvvuru: ఉపాధ్యాయులకు విద్యాబోధనపై డీఈవో కీలక సూచనలు!
Duvvuru: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రయోగాత్మక, సులభతర బోధనా పద్ధతులను అవలంబించాలని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) పేర్కొన్నారు. దువ్వూరు మండలంలోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
ముందుగా పుల్లారెడ్డిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కాంప్లెక్స్ సమావేశానికి హాజరైన డీఈవో, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించారు. తరగతి గదిలో బోధనా ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి పలు సూచనలు చేశారు.
అనంతరం దువ్వూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుల సమావేశాన్ని పరిశీలించారు. సైన్స్ పాఠ్యాంశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరించాలని, ప్రయోగాల ద్వారా బోధించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఏఆర్పీలు (ARPs), ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.
విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఉపాధ్యాయులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అకడమిక్ రీసోర్స్ పర్సన్లు (ARPs), ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




