Badvel: టీడీపీలోకి వైసీపీ శ్రేణులు.. బద్వేల్‌లో పెరిగిన రాజకీయ వేడి!

Badvel: వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ టీడీపీలో భారీ చేరికలు చోటుచేసుకున్నాయి.

B. ARUN KUMAR, BADVEL
Published on: 6 Sept 2026 5:29 PM IST
Badvel
X

Badvel: టీడీపీలోకి వైసీపీ శ్రేణులు.. బద్వేల్‌లో పెరిగిన రాజకీయ వేడి!

బద్వేల్: బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నూతనోత్సాహంతో ముందుకు సాగుతోంది. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గోపవరం మండలంలో పార్టీ బలోపేతానికి చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీని వీడి పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ భారీ చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి హాజరయ్యారు. బద్వేల్ నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు కర్నాటి వెంకటరెడ్డి, కాశినాయన మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

చేరికల సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పీపీ కుంట నుంచి బుచ్చెనపల్లె అంకాలమ్మ తోపు వరకు సుమారు 500 బైకులు, 100 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ జెండాలు, పార్టీ నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా రాజకీయ సందడితో కళకళలాడింది.

భారీ సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనడం ద్వారా గోపవరం మండలంలో టీడీపీ బలం మరోసారి కనిపించిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీకి ఆదరణ పెరుగుతోందని వారు తెలిపారు.

భారీ చేరికలు.. వందలాది వాహనాలతో ర్యాలీ.. కార్యకర్తల ఉత్సాహంతో బద్వేల్ నియోజకవర్గ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా సాగిన ఈ కార్యక్రమం స్థానిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story