Galiveedu: వెలిగల్లు కుడి కాలువకు సాగునీరు విడుదల: మంత్రి మండిపల్లి!
Galiveedu: గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు కుడి కాలువ నుంచి 0.5 టీఎంసీల సాగునీటిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విడుదల చేశారు.
Galiveedu: వెలిగల్లు కుడి కాలువకు సాగునీరు విడుదల: మంత్రి మండిపల్లి!
Galiveedu: గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు కుడి కాలువ నుంచి దిగువ ప్రాంతాల ఆయకట్టు రైతుల సాగునీటి అవసరాల కోసం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ దిగువ ఆయకట్టులోని రైతుల పంట పొలాలకు సాగునీరు అందించేందుకు 0.5 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగింది తెలిపారు. నీటి విడుదలతో దిగువ ప్రాంతాల్లోని కాలువలు, చెరువులు నిండడంతో పాటు రైతుల పంట పొలాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రైతుల సంక్షేమం, సాగునీటి వసతుల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, బూత్ ఇన్‌చార్జులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




