Porumamilla: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబరాలు బద్వేల్ నేతల ర్యాలీ

Porumamilla: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పోరుమామిళ్లలో సూర్యనారాయణ రెడ్డి, చెరుకూరి రవి నాయుడు నేతృత్వంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ, డ్రోన్ షో నిర్వహణ.

P Upendra, Kadapa Porumamilla
Published on: 31 Aug 2026 12:12 PM IST
Porumamilla
X

Porumamilla: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబరాలు బద్వేల్ నేతల ర్యాలీ

Porumamilla: వెలిగొండ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందడంతో పాటు ప్రాంతంలోని చెరువులు నిండనున్న నేపథ్యంలో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోరుమామిళ్లలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.

బద్వేల్ టీడీపీ ఇన్‌చార్జి సూర్యనారాయణ రెడ్డి, RDO చంద్రమోహన్ ఆధ్వర్యంలో, బద్వేల్ యువ నాయకులు చెరుకూరి రవి నాయుడు గారి ఆధ్వర్యంలో వివిధ మండలాల నుంచి రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. డిగ్రీ కళాశాల నుంచి జూనియర్ కళాశాల వరకు ట్రాక్టర్లు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో పోరుమామిళ్ల పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.

జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన drone camera LED షో ద్వారా వెలిగొండ ప్రాజెక్టు ప్రాముఖ్యత, రైతులకు కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. ప్రాజెక్టు ద్వారా నీరు అందడంతో రైతులకు సాగు భరోసా పెరగడంతో పాటు ప్రాంతంలోని చెరువులు, నీటి వనరులు నిండే అవకాశం ఉండటం ఎంతో హర్షణీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు ఈ ప్రాంత రైతుల ఎన్నో ఏళ్ల కల అని, ప్రాజెక్టు ద్వారా నీరు అందడం రైతాంగానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. చెరువులు నిండడం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు విస్తీర్ణం పెరిగి రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని పేర్కొన్నారు.

చేరకూరి రవి నాయుడు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. చెరువులు నీటితో కళకళలాడితే వ్యవసాయానికి మరింత ఊతం లభిస్తుందని, రైతుల ముఖాల్లో ఆనందం చూడటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ప్రాజెక్టు ప్రయోజనాలు పూర్తిస్థాయిలో రైతులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. భారీ ర్యాలీ, ట్రాక్టర్లు, బైకులు, ప్రజల పెద్ద ఎత్తున పాల్గొనడంతో పోరుమామిళ్లలో పండుగ వాతావరణం నెలకొంది.

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla

Next Story