Veeraballi: వివాహేతర సంబంధం అనుమానంతో దారుణ హత్య!

Veeraballi: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడులో వివాహేతర సంబంధం అనుమానంతో దారుణ హత్య. కువైట్ నుండి పథకం రచించి ఖాసీం వలిని హత్య చేసిన భర్త బాషా వర్గం.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 30 Aug 2026 10:31 AM IST
Veeraballi
X

Veeraballi: వివాహేతర సంబంధం అనుమానంతో దారుణ హత్య!

Veeraballi: వివాహేతర సంబంధం అనుమానంతో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం కడప జిల్లా వీరబల్లి మండలం ఓదివీడులో చోటుచేసుకుంది. కడపకు చెందిన బాషాకు, కడప జిల్లా వీరబల్లి మండలం ఓదివీడు కు చెందిన బేల్దారి ఖాదర్ బాషా కుమార్తె షాహీదాతో 2010లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. షాహీదా ఏడేళ్ల క్రితం కువైట్ నుంచి స్వదేశానికి వచ్చి, పుట్టిన ఊరు ఓదివీడులోనే ఇల్లు నిర్మించుకుని ఉంటోంది. ఆమె భర్త బాషా కువైట్ నుంచి కుటుంబానికి కావాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చేవాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భర్త బాషా పిన్నమ్మ కుమారుడైన సయ్యద్ ఖాసీం వలి (ఇతడు కూడా కువైట్లో ఉంటూ అప్పుడప్పుడూ ఓదివీడుకు వచ్చిపోయేవాడు) తరచూ ఓదివీడులోని షాహీదా ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. దీని పై భర్త బాషాకు తీవ్ర అనుమానం వచ్చి పగ పెంచుకున్నాడు. 10 రోజుల క్రితమే ఖాసీం వలి కువైట్ నుంచి ఇంటికి వచ్చిన విషయం బాషాకు తెలిసింది. ఖాసీం వలి ని హత్య చేసేందుకు కువైట్ లో ఉంటున్న బాషా స్వయాన సోదరుడు ఖాదర్ వలీ, తన మరో పిన్నమ్మ కుమారుడు బాబ్జి లు కలిసి ఓ పథకం రచించారు.

ఖాసీం వలి ను వెంటాడి చంపాలని, ఆ సమయంలో తనకు వీడియోలు తీసి పంపాలని వారికి షాహిదా భర్త బాషా సూచించాడు. ఈ క్రమంలో ఆగస్టు 29 శనివారం మధ్యాహ్నం కడప నుంచి ఖాసీం వలి స్కూటీ పై ఓదివీడు లోని షాహిదా ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే మృతుడు ఖాసీం వలి ని వెనుక వైపు ఓ కారులో అనుసరిస్తూ వచ్చిన నిందితులు ఖాదర్ వలీ, బాబ్జి లు ఓదివీడు కు చేరుకున్నారు. అప్పటికే మృతుడు ఖాసీం వలి షాహిదాతో కలిసి బెడ్రూంలో ఉన్నాడు. నిందితులు ఖాదర్ వలీ, బాబ్జి లు షాహిదా ఇంట్లోకి వెళ్లి గడియలు పెట్టారు. బెడ్ రూమ్ తలుపు పగలగొట్టి లోనికి వెళ్లి తమతో తీసుకొచ్చిన కర్ర, బెల్ట్ తో ఖాసీం, షాహీదాలను తీవ్రంగా కొట్టారు. వీరిద్దరినీ కొట్టే దృశ్యాలను షాహీదా కుమార్తెతో బలవంతంగా మొబైల్ ఫోన్ లో వీడియోలు తీయించి కువైట్ లోని షాహిదా భర్త బాషాకు పంపారు.

ఈ ఘటన దాదాపు 2 గంటలపాటు సాగింది. లోపల జరుగుతున్న అరాచకాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే ఖాసీం వలి ని కొట్టి హత్య చేయగా, షాహిదా కు చెయ్యి విరగొట్టారు. ఖాసీం వలి చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు బెడ్రూంలో ఉన్న రక్తపు మరకలను నీళ్లతో పూర్తిగా కడిగేసి సాక్ష్యాలను రూపుమాపే ప్రయత్నం చేశారు. నిందితులు తలుపులు తీయగానే స్థానికులు ఖాదర్ వలీ ని పట్టుకోగా, బాబ్జి అక్కడి నుంచి పరారీ అయ్యాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న వీరబల్లి ఎస్ఐ సుస్మిత కు నిందితుడు ఖాదర్ వలీ ని అప్పగించారు. విషయం తెలుసుకున్న సుండుపల్లి సీఐ సురేష్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఇల్లు, లోపలి ప్రాంతాలను తనిఖీ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఖాసీం వలి మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story