Veeraballi: సెల్ఫీ వీడియో తీసి వ్యక్తి ఆత్మహత్య వీరబల్లిలో విషాదం

Veeraballi: కడప జిల్లా వీరబల్లిలో షేక్ మహమ్మద్ (55) అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య. కేసు నమోదు చేసిన ఎస్ఐ సుస్మిత.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 27 July 2026 9:56 PM IST
Veeraballi
X

Veeraballi: సెల్ఫీ వీడియో తీసి వ్యక్తి ఆత్మహత్య వీరబల్లిలో విషాదం

వీరబల్లి: కడప జిల్లా వీరబల్లికి చెందిన షేక్ మహమ్మద్ (55) అనే వ్యక్తి జీవితంపై విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన నివాసంలోనే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహమ్మద్ ఈ ఘటన కు పాల్పడ్డాడు. తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు ఎంతసేపు తలుపు తట్టినా కూడా స్పందన లేకపోవడంతో కిటికీ నుంచి ఇంటి లోపలికి కుటుంబ సభ్యులు చూశారు.

విగతజీవిగా ఉరి వేసుకొని మృతి చెందిన షేక్ మహమ్మద్ ను చూసి బోరన విలపించారు.విషయం తెలుసుకున్న వీరబల్లి ఎస్ఐ సుస్మిత తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story