Veeraballi: పెదివీడులో జోరుగా 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం

Veeraballi: వీరబల్లి మండలం పెదివీడులో రాజంపేట ఇంచార్జి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగుతున్న 'ఇంటింటికి తెలుగుదేశం' డోర్ టు డోర్ కార్యక్రమం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 17 Aug 2026 9:48 PM IST
Veeraballi
X

Veeraballi: పెదివీడులో జోరుగా 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం

వీరబల్లి: వీరబల్లి మండలం పెదివీడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజంపేట ఇంచార్జి జగన్ మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో "ఇంటింటికి తెలుగుదేశం" డోర్ టు డోర్ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది.

పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిపై ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది.

ఈ కార్యక్రమంలో వీరబల్లి మండల యూత్, పెదివీడు గ్రామ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. "ప్రతి ఇంటి గడపకు తెలుగుదేశం" అనే నినాదంతో కార్యక్రమం ముందుకు సాగుతోంది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story