Rayachoty: నల్లగంగమ్మ ఆలయంలో వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం
Rayachoty: రాయచోటి నియోజకవర్గం సంబేపల్లె శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ తల్లి ఆలయంలో శ్రావణ వరలక్ష్మి వ్రతం. పాల్గొన్న పాల ఏకిరి కార్పొరేషన్ చైర్మన్ కందూరి నాగేశ్వర్ నాయుడు.
Rayachoty: నల్లగంగమ్మ ఆలయంలో వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం
Rayachoty: సిరిసంపదలకు, సౌభాగ్యానికి, సుఖశాంతులకు ప్రతీకగా భావించే వరలక్ష్మీదేవి ఆరాధనను పురస్కరించుకుని సంబేపల్లె శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో పులకించింది. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవిని ఆరాధించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
వేదమంత్రాలు నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా.. మహిళలు సంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, నైవేద్యాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
అమ్మవారి కృప కోసం సామూహిక వ్రతం..
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు కుటుంబ సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వరలక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా కుటుంబంలో శుభమంగళాలు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు.
వ్రతానికి హాజరైన ప్రతి మహిళకు ఆలయం తరఫున పసుపు, కుంకుమ, రవిక బట్ట, గాజులు అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కూనాసి సుబ్బరాజు యాదవ్ , ఈఓ దేవదాసు, అర్చకులు అరుణాచలం మాట్లాడుతూ.. వరలక్ష్మీ వ్రతంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు.అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలని.. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సౌభాగ్యం, ఆనందం నిండాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ వరలక్ష్మి వ్రతం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ చైర్మన్ కందూరి నాగేశ్వర్ నాయుడు. రాష్ట్ర బంజారా సంఘ్ నాయుకులు జయరాం అఖండ నాయక్ ఆలయ కమిటీ డైరెక్టర్ లు అంచల రఘు. ఆంజనేయులు మురగేష్. వేణుగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.




