Rayachoti: అధిక ధరలకు యూరియా విక్రయంపై రైతుల ఆందోళన!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 5 Aug 2026 10:58 AM IST
Rayachoti
X

Rayachoti: అధిక ధరలకు యూరియా విక్రయంపై రైతుల ఆందోళన!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో మళ్లీ మొదలైన యూరియా కష్టాలు

ఓవైపు ప్రభుత్వం రైతులకు అవసరమయ్యే యూరియా ఉందని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ అవి ప్రకటనలు లాగే మిగిలిపోయాయి

మరోవైపు ఇదే అదునుగా తీసుకొని కొంతమంది వ్యాపారస్తులు తమ స్వలాభాల కోసం అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నారు.

అన్నమయ్య జిల్లా రాయచోటిలో రైతుకు 270 రూపాయలకు అందవలసిన యూరియాను కొంతమంది వ్యాపారస్తులు దానిని 350నుంచి 450 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.

పంటలు సాగు చేసిన రైతులు యూరియా కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్న వారికి కేవలం 1 ప్యాకెట్లు మాత్రమే యూరియాను ఇస్తున్నారు వారికి అవసరమయ్యే మేరా యూరియా ఇవ్వడం లేదు.

ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి బ్లాక్ మార్కెట్ను అరికట్టి రైతులకు సరైన ధరకు యూరియా అందేలా చూడాలని రైతులు వాపోతున్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story