Annamayya: పోలీసుల అప్రమత్తతతో సచివాలయంలో తప్పిన చోరీ!

Annamayya: పుంగనూరు మండలం ఉలువలదిన్నె సచివాలయానికి తాళాలు వేయకుండా వెళ్లిన సిబ్బంది. రాత్రి గస్తీలో బీట్ పోలీసులు గుర్తించి అప్రమత్తం చేయడంతో తప్పిన భారీ చోరీ.

MAHESH, PUNGANOOR
Published on: 12 Aug 2026 10:14 AM IST
Annamayya
X

Annamayya: పోలీసుల అప్రమత్తతతో సచివాలయంలో తప్పిన చోరీ!

Annamayya: అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం ఉలువలదిన్నె సచివాలయానికి సిబ్బంది మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని తాళాలు వేయకుండా వెళ్లిపోయారు.

రాత్రి గస్తీలో ఉన్న బీట్ కానిస్టేబుళ్లు తాళాలు వేయని విషయాన్ని గుర్తించి పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో భారీ చోరీ ప్రమాదం తప్పింది. సచివాలయంలో విలువైన కంప్యూటర్లు, బ్యాటరీలు, ప్రభుత్వ సామగ్రి, ప్రజల ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉండటంతో సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన సచివాలయ సిబ్బందిపై, శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story