Kadapa: మద్యం మత్తులో అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు!
Kadapa: కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో మద్యం మత్తులో అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kadapa: మద్యం మత్తులో అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు!
Kadapa: కడపజిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రమైన కొత్తూరు గ్రామానికి చెందిన వజ్రాల సుబ్బరాయుడు హైమావతి లకు ఇద్దరు కుమారులు.
పెద్ద కుమారుడు వజ్రాల వెంకటసుబ్బయ్య, చిన్న కుమారుడు వజ్రాల సురేష్ వీరిద్దరూ వృత్తిరీత్యా డ్రైవర్లు అయితే మద్యానికి బానిస కావడంతో అన్నదమ్ములు ఇద్దరు భార్యలు వదిలి వేయడం జరిగింది. అన్న వెంకటసుబ్బయ్య ఉదయం కొండ ప్రాంతంలో దొరికే దాదరాకుకు వెళ్లి తీసుకువచ్చి మంచంలో నిద్రలోకి జారుకున్నాడు.
మద్యం మత్తులో ఉన్న తమ్ముడు సురేష్ తలవెనుక భాగంలో గొడ్డలితో కొట్టడం జరిగింది. రోడ్డుపైకి వచ్చి కొద్దిసేపు ఆగి మళ్లీ వెళ్లి మరోసారి అదే గొడ్డలితో కొట్టడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివప్రసాద్ సంఘటనస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు
Next Story




