Rayachoti: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన.. హెల్మెట్ లేనిదే ప్రయాణం వద్దు!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకం, మైనర్ డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 1 Aug 2026 10:31 AM IST
Rayachoti
X

Rayachoti: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన.. హెల్మెట్ లేనిదే ప్రయాణం వద్దు!

Rayachoti: వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలామంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని , కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అన్నమయ్య జిల్లా, రాయచోటి ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఆదేశాల మేరకు సుండుపల్లి రోడ్డులో హెల్మెట్ వాడకం ,మైనర్ డ్రైవింగ్, ఇన్సూరెన్స్ , డ్రంక్ అండ్ డ్రైవ్ లతో పాటు రోడ్డు నియమ నిబంధనలపై పట్టణ ట్రాఫిక్ సిఐ చాన్ బాషా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ హెల్మెట్ వాడక పోవడం వల్ల జరిగే నష్టాలను వాహనదారులకు తెలిపారు. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. చిన్నపిల్లలు సరదా పడుతున్నారని లేదా వారి అతిగారాబం వల్ల మైనర్లకు వాహనాలు తీయించడం కారణంగా వారి అతివేగం వల్ల వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని , అంతేకాకుండా మైనర్లతోపాటు తల్లిదండ్రులకు కఠిన శిక్షలు వర్తిస్తాయని తెలిపారు.

ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి అని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబం నష్టపరిహారం పొందటానికి ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని, కావున ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కచ్చితంగా చేసుకోవాలని సూచించారు.ప్రతి వాహనదారుడు సరైన పత్రాలను తమ వద్ద ఉంచుకోవడంతోపాటు, ట్రాఫిక్ నియమ , నిబంధనలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా తమ గమ్యస్థానాలను చేరాలని ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా కోరారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐతో పాటు రామాంజి , నాగేంద్ర, ఆంజనేయులు తో పాటు హోంగార్డు విరుపాక్షి పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story