Rayachoti: రాయచోటిలో ఘనంగా 'THE ONE & ONLY' సెలూన్ షాప్ ప్రారంభం!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో 'THE ONE & ONLY' సెలూన్ షాప్‌ను ప్రారంభించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు.
Rayachoti: రాయచోటిలో ఘనంగా 'THE ONE & ONLY' సెలూన్ షాప్ ప్రారంభం!
Rayachoti: రాయచోటి పట్టణంలోని జగదాంబ సెంటర్ సమీపంలో కొత్తపేట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన THE ONE & ONLY సెలూన్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం ఘనంగా జరిగింది.
సెలూన్ యజమాని కాళేశ్వరావు గారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, రాయచోటి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు విచ్చేశారు.
ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి THE ONE & ONLY సెలూన్‌ను ప్రారంభించారు. అనంతరం నూతనంగా ప్రారంభమైన వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెందాలని, యాజమాన్యానికి మంచి పేరు, ఆదాయం కలగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రసాద్ బాబు గారు కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా THE ONE & ONLY సెలూన్ యాజమాన్యం, సిబ్బంది మరియు అభిమానులు ఘన స్వాగతం పలికారు. డప్పుల మోత, టపాసుల సందడి మధ్య ఘనంగా ఆహ్వానించి, గజమాలతో సత్కరించి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ, యువత ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లో కూడా ముందుకు రావాలని, కష్టపడి పనిచేస్తే ప్రతి రంగంలోనూ మంచి భవిష్యత్తు సాధించవచ్చని ఆకాంక్షించారు.
THE ONE & ONLY సెలూన్ ఆధునిక సదుపాయాలతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ రాయచోటిలో మంచి గుర్తింపు పొందాలని, యాజమాన్యం వ్యాపారంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శుభాకాంక్షలు తెలిపారు.




