Rayachoti: ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డిని కలిసి ఉపాధ్యాయుల సమస్యల వినతి

Rayachoti: రాయచోటిలో ఎన్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డిని కలిసి పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 27 Aug 2026 7:21 PM IST
Rayachoti
X

Rayachoti: ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డిని కలిసి ఉపాధ్యాయుల సమస్యల వినతి

రాయచోటి: రాయచోటిలో ఎన్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. స్పెషల్‌ టెట్‌లో ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేక రాయితీలు కల్పించి, పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌ విధానంలో నిర్వహించాలని కోరారు.

రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో 16 శాతం హెచ్‌ఆర్‌ఏను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. డైట్‌లలో ఖాళీగా ఉన్న లెక్చరర్‌, సీనియర్‌ లెక్చరర్‌ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్సీని కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story