Rayachoti: ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదానం.. పాల్గొన్న మౌర్యా రెడ్డి!
Rayachoti: సుండుపల్లె రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రావణ శనివారం అన్నదాన కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు మౌర్యా రెడ్డి పాల్గొన్నారు.
Rayachoti: ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదానం.. పాల్గొన్న మౌర్యా రెడ్డి!
రాయచోటి: శ్రావణ శనివారం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సుండుపల్లె రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వి.వాసుదేవ రెడ్డి గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మౌర్యా రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా అందిస్తూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రావణ శనివారం పర్వదినాన ఆంజనేయ స్వామి సన్నిధిలో అన్నదానం చేయడం ఎంతో విశిష్టమైన సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. భక్తులకు అన్నప్రసాదం అందిస్తూ, సేవా భావంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మౌర్యా రెడ్డి గారికి ఆలయ నిర్వాహకులు, భక్తులు అభినందనలు తెలిపారు.
Next Story




