Rayachoti: పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకల్లో టీడీపీ యువనేత మండిపల్లి నిశ్చల్!
Rayachoti: రాయచోటిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో మంత్రి కుమారుడు, టీడీపీ యువనేత మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి పాల్గొన్నారు.
Rayachoti: పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకల్లో టీడీపీ యువనేత మండిపల్లి నిశ్చల్!
రాయచోటి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుమారుడు, టీడీపీ యువనేత మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు పప్పిరెడ్డి మహేశ్వర రెడ్డి మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డిని ఘనంగా సత్కరించారు.
జనసేన నాయకులు, ప్రజాచైతన్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని నిశ్చల్ నాగిరెడ్డి సందర్శించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న యువతను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.రక్తదానం వంటి మహోన్నత సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని మరింత పెంపొందిస్తాయని, యువత సేవా కార్యక్రమాల్లో ముందుండి పాల్గొనడం ద్వారా అనేక మందికి స్ఫూర్తిగా నిలవాలని మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి ఆకాంక్షించారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక్క రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడగలదనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకువచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పఠాన్, ప్రజాచైతన్య సేవా సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ స్వాతి, సిబ్బంది నిమ్రా, ప్రియాంక, షబానా, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.




