Rayachoty: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త అకాల మృతి!

Rayachoty: టీడీపీ కార్యకర్త చైతన్య కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆయన భౌతికకాయానికి టీడీపీ యువ నేత మౌర్య రెడ్డి నివాళులర్పించి పరామర్శించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 25 July 2026 8:36 PM IST
Rayachoty
X

Rayachoty: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త అకాల మృతి!

రాయచోటి: రాయచోటికి చెందిన టిడిపి కార్యకర్త చైతన్య కుమార్ యాక్సిడెంట్ జరిగి ప్రమాదవశాత్తు మరణించడంతో ఆయన భౌతికకాయాన్ని టిడిపి యువ నాయకులు మౌర్య రెడ్డి గారు సందర్శించి పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మౌర్య రెడ్డి గారు వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. చైతన్య కుమార్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story