Rayachoty: మాజీ సర్పంచ్ వాసును పరామర్శించిన టీడీపీ నాయకులు మౌర్యా రెడ్డి!
Rayachoty: సాయి ప్రశాంతి ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెంబడపల్లి మాజీ సర్పంచ్ వాసును టీడీపీ నాయకులు మౌర్యా రెడ్డి పరామర్శించి, ధైర్యం చెప్పారు.
Rayachoty: మాజీ సర్పంచ్ వాసును పరామర్శించిన టీడీపీ నాయకులు మౌర్యా రెడ్డి!
Rayachoty: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ సర్పంచ్ వాసును పరామర్శించిన టీడీపీ నాయకులు మౌర్యా రెడ్డి...
రాయచోటి మండలం పెంబడపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వాసు అనారోగ్యంతో బాధపడుతూ రాయచోటిలోని సాయి ప్రశాంతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మౌర్యా రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
వాసు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మౌర్యా రెడ్డి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి, వాసు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.
ఆపదలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలవడం తమ బాధ్యత అని మౌర్యా రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వాసు కుటుంబ సభ్యులు మౌర్యా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.




