Rayachoty: 'ఇంటింటికీ టీడీపీ' చెన్నముక్కపల్లిలో కరపత్రాల పంపిణీ!

Rayachoty: రాయచోటి మండలం చెన్నముక్కపల్లిలో 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 11 Aug 2026 4:38 PM IST
Rayachoty
X

Rayachoty: 'ఇంటింటికీ టీడీపీ' చెన్నముక్కపల్లిలో కరపత్రాల పంపిణీ!

Rayachoty: రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాయచోటి టిడిపి మండల అధ్యక్షులు పాల్గొని కరపత్రాలను పంపిణి చేశారు. అలాగే ఆయన తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో మెగా డీఎస్సీపై వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

చేసిన మంచి పనిని చెప్పకపోతే, తప్పుడు ప్రచారమే నిజం అనుకుంటారని, వైసిపి చేస్తున్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

అలాగే రాయచోటి నియోజకవర్గం లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసిపి నాయకులకు వణుకు పుడుతుంది అన్నారు. రాయచోటిలో గత రెండు రోజులుగా వైసీపీ కార్యకర్తలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. డీఎస్సీ అంటే.అర్థం తెలియని వారు కూడా రిలే నిరాహార దీక్షలు చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story