Rayachoti: శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి టీడీపీ నేత డాక్టర్ మండిపల్లికి ఆహ్వానం!

Rayachoti: శ్రీ మల్లూరమ్మ ఆలయంలో ఈ నెల 27న జరగనున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డికి ఆహ్వానం అందింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 24 Aug 2026 12:24 PM IST
Rayachoti
X

Rayachoti: శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి టీడీపీ నేత డాక్టర్ మండిపల్లికి ఆహ్వానం!

రాయచోటి: చిన్నమండెం మండలం కొత్తపల్లి శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారిని మాజీ సర్పంచ్ వెంకటరామిరెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను వివరించి, కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానం అందించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న ఈ పవిత్ర కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story