Proddatur: జాబివుల్లా బర్త్‌డే వేడుకలు ప్రొద్దుటూరులో రక్తదానం చేసిన యువత
Proddatur: కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వైఎస్ జాబివుల్లా 53వ పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దుటూరులో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
Proddatur: జాబివుల్లా బర్త్‌డే వేడుకలు ప్రొద్దుటూరులో రక్తదానం చేసిన యువత
ప్రొద్దటూరు: కడప జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి వైఎస్ జబీవుల్లా 53 జన్మదిన సందర్భంగా ప్రొద్దుటూరులోని తన కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వైఎస్ జబీవుల్లా మాట్లాడుతూ పుట్టినరోజులు కేవలం వేడుకలా కాకుండా సమాజానికి ఉపయోగపడేలా జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నాము. ప్రాణాలను రక్షించే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు తలసేమియా పిల్లలకు మరియు ప్రమాద బాధితులకు సకాలంలో రక్తం అందించి ప్రాణాలు కాపాడడం. రక్తదానం అనేది మరొకరికి జీవితాన్ని ప్రసాదించడంతో సమానం. ఈ రక్తదాన శిబిరానికి భారీగా యువత వచ్చి రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.




