Rayachoty: కట్నం వేధింపులే ప్రాణం తీశాయా? రాయచోటిలో విషాదం!
Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి రాజుల కాలనీలో 7 నెలల గర్భిణి రెహాబ్ జాన్ అనుమానాస్పదంగా మృతి చెందింది.
Rayachoty: కట్నం వేధింపులే ప్రాణం తీశాయా? రాయచోటిలో విషాదం!
Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం రాజుల కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. రెహాబ్ జాన్ (24) అనే 7 నెలల గర్భిణి అనుమానస్పద మృతి చెందింది. ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త రెడ్డి భాష, అత్తమామలు కలిసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
వివాహమైన 2 నెలల నుంచి అదనపు కట్నం కోసం రెహాబ్ జాన్ ను భర్త రెడ్డి భాష, అత్తమామలు వేధిస్తూ వచ్చారంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. 9 నెలల క్రితం రామాపురం మండలం గంగనేరు గ్రామానికి చెందిన షేక్ రెహాబ్ జాన్ కు రాయచోటి కి చెందిన రెడ్డి భాష తో వివాహం జరిగింది. రాయచోటి డిఎస్పి కృష్ణమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు.




