Rayachoti: ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో సుగవాసి ప్రసాద్ బాబు!
Rayachoti: రాయచోటి మాండవ్య నది ఒడ్డున ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
Rayachoti: ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో సుగవాసి ప్రసాద్ బాబు!
రాయచోటి: మాండవ్య నది ఒడ్డున ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు రామనామ స్మరణతో మారుమోగాయి. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రసాద్ బాబు గారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు వాకా అన్నయ్య గారు ఆత్మీయ స్వాగతం పలికి శాలువా, గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.




