Rayachoti: కుటాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సుగవాసి ప్రసాద్ బాబు!

Rayachoti: రాయచోటిలోని కుటాలమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 17 Aug 2026 3:27 PM IST
Rayachoti
X

Rayachoti: కుటాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సుగవాసి ప్రసాద్ బాబు!

Rayachoti: రాయచోటి పట్టణం మదనపల్లి రోడ్డులో శ్రీ శ్రీ కుటాలమ్మ తల్లి అమ్మవారి కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమానికి పసుపులేటి సుధాకర్ గారి ఆహ్వానం మేరకు రాజంపేట పార్లమెంట్ టీడీపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారు శ్రీ శ్రీ శ్రీ కుటాలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు సుగవాసి ప్రసాద్ బాబు గారికి సాదర స్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని సుగవాసి ప్రసాద్ బాబు గారు ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story