Rayachoti: కొండూరు వారి నూతన గృహప్రవేశ వేడుకల్లో సుగవాసి ప్రసాద్ బాబు!

Rayachoti: శిబ్యాలలోని నక్కల మొరం రాచపల్లెలో కొండూరు వంశీ రాజు నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 28 Aug 2026 3:46 PM IST
Rayachoti
X

Rayachoti: కొండూరు వారి నూతన గృహప్రవేశ వేడుకల్లో సుగవాసి ప్రసాద్ బాబు!

Rayachoti: రాయచోటి నియోజకవర్గం శిబ్యాల గ్రామం నక్కల మొరం రాచపల్లెలో కొండూరు వంశీ రాజు గారి నూతన గృహప్రవేశ మహోత్సవం శుక్రవారం ఘనంగా, ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు.

ఈ శుభకార్యానికి రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు & టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరై, నూతన గృహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు.

ఈ సందర్భంగా కొండూరు కుటుంబ సభ్యులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుని ఆశీస్సులతో ఈ నూతన గృహం ఎల్లప్పుడూ సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం, సమృద్ధితో కళకళలాడాలని ఆకాంక్షించారు.

కొత్త ఇంటి గడప తొక్కిన ఈ శుభదినం కుటుంబ సభ్యుల జీవితాల్లో మరెన్నో ఆనందాలను, విజయాలను తీసుకురావాలని, వారి కుటుంబంలో అభివృద్ధి, ఆరోగ్యం, ఆనందం ఎల్లప్పుడూ వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కొండూరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story