Rayachoti: శ్రావణ మాసంలో అన్నదానం ఎంతో పుణ్యకార్యం సుగవాసి ప్రసాద్ బాబు

Rayachoti: రాయచోటి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ శనివారం ప్రత్యేక పూజలు, అన్నదానం. హాజరైన రాజంపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 16 Aug 2026 1:32 PM IST
Rayachoti
X

Rayachoti: శ్రావణ మాసంలో అన్నదానం ఎంతో పుణ్యకార్యం సుగవాసి ప్రసాద్ బాబు

Rayachoti: శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డు, గాలివీడు రోడ్డు, పవిత్ర శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ శ్రీ సుగవాసి పాలకొండరాయుడు గారు నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మన్నేరు రామాంజనేయులు గారు ఏర్పాటు చేసిన స్వామివారి అభిషేకం, ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరై స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ “అన్నదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదానం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే సాక్షాత్తు భగవంతునికి నైవేద్యం సమర్పించినట్లే.

పవిత్రమైన శ్రావణమాసంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు సమాజంలో భక్తిభావాన్ని, సేవా స్ఫూర్తిని మరింత పెంపొందిస్తాయి” అని అన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story