Mydukur: సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంట విత్తనాలు: ఏవో అమర్నాథ్ రెడ్డి!

Mydukur: వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని దువ్వూరు ఏవో అమర్నాథ్ రెడ్డి సూచించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 8 Sept 2026 6:05 PM IST
Mydukur
X

Mydukur: సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంట విత్తనాలు: ఏవో అమర్నాథ్ రెడ్డి!

మైదుకూరు, దువ్వూరు: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి (ఏవో) అమర్నాథ్ రెడ్డి సూచించారు. జొన్నవరం గ్రామంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు కీలక సూచనలు చేశారు.

​ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న నీటి ఎద్దడి దృష్ట్యా కేసీ కెనాల్ ఆయకట్టు, మెట్ట భూముల్లో సాగు కోసం ప్రభుత్వం మినుములు, ఉలవ విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు అనుమతినిచ్చిందని తెలిపారు. అలాగే హైబ్రిడ్ జొన్న విత్తనాలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, అనుమతి రాగానే పంపిణీ చేస్తామని చెప్పారు. అర్హులైన రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో (ఆర్బీకే) సబ్సిడీ విత్తనాలు పొందవచ్చని సూచించారు.

భూగర్భ జలాలు అడుగంటినందున రైతులు బోర్ల కింద వరి సాగు చేసి నష్టపోవద్దని, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపే మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు పొందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన ప్రతి పంట వివరాలను రైతులు ఈ-క్రాప్ (పంట నమోదు) బుకింగ్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ) మనోజ్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story