Rayachoti: సానిపాయలో రైతులకు సబ్సిడీ యూరియా పంపిణీ!

Rayachoti: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం సానిపాయ స్వర్ణ గ్రామంలో రైతులకు సబ్సిడీ యూరియాను పంపిణీ చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 5 Sept 2026 7:45 PM IST
Rayachoti
X

Rayachoti: సానిపాయలో రైతులకు సబ్సిడీ యూరియా పంపిణీ!

రాయచోటి: వీరబల్లి మండలములోని సానిపాయ స్వర్ణ గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. సానిపాయ గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారి సోమలరాజు జ్యోతీశ్వర రాజు ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి సోమలరాజు జ్యోతీశ్వర రాజు మాట్లాడుతూ, రైతులపై ఎరువుల ధరల భారం పడకుండా ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందిస్తూ యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. 45 కిలోల యూరియా బస్తా వాస్తవ ధర రూ.1,947/- కాగా, ప్రభుత్వం రూ.1,680.50/- సబ్సిడీ అందించడం ద్వారా రైతులకు కేవలం రూ.266.50/-కే అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

రైతులు ఈ ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, ఎరువులను నిర్ణీత ధరలకు మాత్రమే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో వీరబల్లి మండల స్వర్ణ గ్రామాధికారి మరియు సానిపాయ గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారి సోమలరాజు జ్యోతీశ్వర రాజు, పంచాయతీ వ్యవసాయాధికారి రామాంజులు, సానిపాయ స్వర్ణ గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్పుట్స్ సకాలంలో అందించేందుకు చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story