Duvvuru: వినాయక చవితి ప్రశాంతంగా జరుపుకోవాలి: దువ్వూరు ఎస్సై ధనుంజయుడు

Duvvuru: వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని దువ్వూరు ఎస్సై జె. ధనుంజయుడు స్పష్టం చేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 11 Sept 2026 8:35 PM IST
Duvvuru
X

Duvvuru: వినాయక చవితి ప్రశాంతంగా జరుపుకోవాలి: దువ్వూరు ఎస్సై ధనుంజయుడు

మైదుకూరు, ​దువ్వూరు: మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక ఎస్సై జె. ధనుంజయుడు పిలుపునిచ్చారు. పండుగను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.

​కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మండలంలో పటిష్ట భద్రతా చర్యలు, ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు:

​డీజేలపై నిషేధం: వినాయక నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలు, ఆర్కెస్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు.

​వాహనదారులకు హెచ్చరిక: శోభాయాత్రలో పాల్గొనే లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాహనాలను జాగ్రత్తగా నడపాలి.

​శాంతిభద్రతల పరిరక్షణ: ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనం, సోదరభావం పాటించాలి.

​నిర్వాహకుల పర్యవేక్షణ: విగ్రహ నిమజ్జన ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు, వాలంటీర్లు అక్కడే ఉండి భద్రతను పర్యవేక్షించాలి.

​ఈ కార్యక్రమంలో ఏఎస్సై వెంకట సుబ్బయ్య, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందితో పాటు మండలంలోని వివిధ గ్రామాల వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR