Rayachoti: సిబ్యాలలో శ్రీ సీతారాముల ఆలయ భూమి పూజ!

Rayachoti: రాయచోటి మండలం సిబ్యాల అనుంపల్లిలో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి భూమి పూజ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Sept 2026 12:00 PM IST
Rayachoti
X

Rayachoti: సిబ్యాలలో శ్రీ సీతారాముల ఆలయ భూమి పూజ!

Rayachoti: రాయచోటి మండలం సిబ్యాల గ్రామం, అనుంపల్లిలో రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమిపార్టీ సహకారంతో నిర్మిస్తున్న శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి ముఖ్యఅతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి పాల్గొని పూజ కార్యక్రమాలు చేశారు.

రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్ష్మి ప్రసాద్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. దేవాలయాలకు ప్రభుత్వం అందిస్తున్న సిజిఎఫ్ గ్రాంట్ తో ఈ ఆలయ నిర్మాణం 93.లక్షల రూపాయల ప్రభుత్వ సహకారంతో ఆలయ నిర్మాణం జరుగుతుందని రాయచోటి నియోజకవర్గం లో దాదాపు 70 దేవాలయాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కూటమి ప్రభుత్వంలో అనేక నూతన దేవాలయాలలు నిర్మిస్తున్నారని మంత్రి మండిపల్లి సోదరుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story