Kadapa: కడపలో ఎస్పీ 'సింగం' అవతారం.. అర్ధరాత్రి రౌడీల గుండెల్లో రైళ్లు!
Kadapa: కడప నగరంలో అర్ధరాత్రి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సర్చ్. ఆలంఖాన్ పల్లి, అల్మాస్ పేటలో తనిఖీలు. 30 వాహనాలు, కత్తి స్వాధీనం.
Kadapa: కడపలో ఎస్పీ 'సింగం' అవతారం.. అర్ధరాత్రి రౌడీల గుండెల్లో రైళ్లు!
వై.ఎస్.ఆర్ కడప జిల్లా: జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారి నేతృత్వంలో పోలీసు బలగాలతో అర్ధరాత్రి కడప నగరంలోని ఆలంఖాన్ పల్లి , అల్మాస్ పేట, మాసాపేట లలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ తనిఖీల్లో 30 ద్విచక్ర వాహనాలు, కత్తి స్వాధీనం జిల్లాలో రౌడీయిజానికి తావులేదు.. కడప నగరంలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్.పీ గారు. రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకుంటాం ..జిల్లా ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారు.
కడప శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ నేతృత్వంలో పోలీస్ బలగాలతో మంగళవారం రాత్రి నుండి అర్ధరాత్రి వరకూ కడప నగరంలోని పలు ప్రాంతాలలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించి పలువురు అనుమానితుల, పాత నేరస్థుల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆలంఖాన్ పల్లి లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ లో జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గారు అనుమానితులు, పాత నేరస్థుల ఇళ్లలో స్వయంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్ పేట సర్కిల్ వద్ద నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి జిల్లా ఎస్.పీ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రౌడీ యిజానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రిపూట రోడ్లపై అనవసరంగా తిరుగుతూ న్యూసెన్స్ చేసే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో రౌడీయిజానికి తావులేదని ఎస్.పీ తెలిపారు. గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల బద్వేలు, కమలాపురం లలో గంజాయి బ్యాచ్ లపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్.పీ వివరించారు. నగరంలో నిర్వహించిన కార్డన్ అండ్ సర్చ్, అర్ధరాత్రి వాహన తనిఖీల్లో 30 ద్విచక్ర వాహనాలను, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ లో ప్రొద్దుటూరు ఏ.ఎస్.పీ విబుకృష్ణ ఐ.పీ.ఎస్ గారు, స్పెషల్ బ్రాంచ్ డీ.ఎస్.పీ శ్రీ ఎన్ .సుధాకర్ గారు, మైదుకూరు డీ.ఎస్.పీ రాజేంద్రప్రసాద్ గారు, కడప నగరంలోని సి.ఐ లు, జిల్లాలోని సి.ఐ లు, ఎస్.ఐ లు , స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.


