Rayachoty: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ!
Rayachoty: పవిత్ర మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Rayachoty: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ!
Rayachoty: పవిత్ర మిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, పరస్పర సౌభ్రాతృత్వంతో పండుగ జరుపుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.పండుగ వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రార్థనా స్థలాలు, మసీదుల వద్ద పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Next Story




