Veeraballi: సానిపయ పంచాయతీ సమావేశం డిప్యూటీ ఎంపీడీవో జ్యోతిశ్వర చర్చలు!

Veeraballi: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం సానిపయ పంచాయతీలో డిప్యూటీ ఎంపీడీవో జ్యోతిశ్వర రాజు ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 11 Aug 2026 4:55 PM IST
Veeraballi
X

Veeraballi: సానిపయ పంచాయతీ సమావేశం డిప్యూటీ ఎంపీడీవో జ్యోతిశ్వర చర్చలు!

Veeraballi: సానిపయ గ్రామపంచాయతీలో సమావేశం. సమస్యలను వివరించిన ప్రజలువీరబల్లి మండలం సానిపయ గ్రామపంచాయతీలో గ్రామ ప్రత్యేక అధికారి, డిప్యూటీ ఎంపీడీవో జ్యోతిశ్వర రాజు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను ప్రజలు, గ్రామ నాయకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు తదితర అంశాలపై ప్రజలు వివరించారు.

ప్రజలు వివరించిన సమస్యలపై అధికారులు స్పందిస్తూ, వాటిని పరిశీలించి నిబంధనల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో గ్రామ నాయకులు, ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story