Duvvuru: తాగునీటి కోసం తెలుగుగంగ SR1, SR2 ప్రాజెక్టులకు నీటి విడుదల చేయాలి!

Duvvuru: దువ్వూరు, మైదుకూరు ప్రజలకు తాగునీటి కోసం వెలుగుల నుంచి తెలుగుగంగ SR1, SR2కు నీటిని విడుదల చేయాలని కడప రైతు సేవా సమితి వినతి.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 11 Sept 2026 3:02 PM IST
Duvvuru
X

Duvvuru: తాగునీటి కోసం తెలుగుగంగ SR1, SR2 ప్రాజెక్టులకు నీటి విడుదల చేయాలి!

Duvvuru: కడప జిల్లాలో దువ్వూరు ,మైదుకూరు మండల ప్రజలకు తాగునీటి కోసం తెలుగుగంగ sr1,sr2 ప్రాజెక్టులకు వెలుగోడు నుంచి నీటిని విడుదల చేయాలని రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.

రైతు సేవాసమితి కడపజిల్లా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి కడప జిల్లా ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రైతు గ్రామ బాటా కార్యక్రమం ఈరోజు 11వ రోజు కార్యక్రమం దువ్వూరు మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు సేవాసమితి దువ్వూరు మండల సమితినాయకులు ,రైతులుతో కలిసి నిరసన తెలియజేసి.

అనంతరం ఎలిననో ప్రభావంతో వర్షాలులేక, కడప జిల్లాలోఉన్న సాగునీటి ప్రాజెక్టులనుహైనా కేసీ.కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతులకు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఎటువంటి పంటలకు కూడా నీరు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందున కడప జిల్లానుకరువు జిల్లాగా ప్రకటించి, ప్రతిరైతు కుటుంబానికి ఈ సంవత్సరం జీవనోపాధి కోసం 30 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందజేయాలని, అలాగే భవిష్యత్తులో కూడా నీరు లేక రైతులు, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ లైన రాజోలి, జోలద రాశి, తెలుగుగంగ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి తొందరగా పూర్తిచేయాలని తదితర సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని దువ్వూరు మండల తాసిల్దార్ భూమి రెడ్డి సునీత గారికి అందజేసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సేవాసమితి మైదుకూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి సహదేవుడు, అన్నవరం వెంకటేశ్వర్లు, రైతు సేవా సమితి దువ్వూరు మండల్ నాయకులు కటారు రాఘవేంద్ర, జిల్లెల్ల శ్యామ్ కుమార్, సురేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బీసీ. మాచయ్య తదితరులతో పాటు రైతులు కూడా పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR