Mydukur: రాయలసీమకు వెంటనే తాగు, సాగునీరు విడుదల చేయాలి!
Mydukur: శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తాగు, సాగునీరు వెంటనే విడుదల చేయాలని అఖిల భారత రెడ్డి
Mydukur: రాయలసీమకు వెంటనే తాగు, సాగునీరు విడుదల చేయాలి!
Mydukur: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తక్షణం త్రాగునీటి తోపాటు పంటల సాగుకు వెంటనే నీరు విడుదల చేయాలని అఖిల భారత రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి,రైతువిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మంచాల సుధాకర్ రెడ్డి లు డిమాండ్ చేశారు. గురువారం దువ్వూరు లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల జిల్లాలో ఖరీఫ్ లో సాగు కావలసిన పంటల విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడో కొంత బోర్ల కింద మాత్రమే పంటలు సాగు చేశారు.
ఆరుతడి పంటలు సాగు చేసుకునేందుకు అయినా తగినంత వర్షపాతం లేకపోవడంతో ఆ పంటలు కూడా వేయలేని పరిస్థితి దాపురించింది. జిల్లాలో ఉన్న రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా అడుగంటి పోయింది. ప్రస్తుతం రిజర్వాయర్లలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వచ్చే నీటితో నిండే రిజర్వాయర్లు గోరకల్లు రిజర్వాయర్ లో2.4 టీఎంసీలు, అవుకు రిజర్వాయర్ లో 0.76 టీఎంసీ, గండికోట రిజర్వాయర్ లో15.87.టీఎంసీ, వామి కొండ రిజర్వాయర్లో 0.65, సర్వరాయ సాగర్ 0.45, చిత్రావతి 3.36, పైడిపాలెం 3.15, మైలవరం రిజర్వాయర్లో 2.46 టీఎంసీల నీరు ఉన్నది.
వెలుగోడు 1.65 టీఎంసీలు, ఎస్సార్ 1తెలుగు గంగా డ్యామ్ లో 090 టిఎంసీలు, ఎస్ ఆర టీఎంసీల, బ్రహ్మం సాగర్,నికరజలాలు వాటా కలిగిన కేసీ కెనాల్ 10 టిఎంసిల నీరు రావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం.
శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగుల నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేసి జిల్లాలోని ప్రాజెక్టులకు మరియు కేసీ కెనాల్ కు నీరు అందించాలని అఖిల భారత రెడ్డి సంఘం డిమాండ్ చేస్తోంది.
పట్టిసీమ ద్వారా కృష్ణ డెల్టా ఆయకట్టుకు నీరు వదిలి ఆ మేరకు శ్రీశైలం వెనుక జలాలను రాయలసీమకు మళ్ళి స్తామని ప్రభుత్వం అనేక దఫాలుగా ప్రకటనలు చేసింది. ఆ మాటలు నీటి మీద రాతలుగా ఉండకుండా ఆచరణలో పెట్టాల్సి ఉందని అప్పుడే రాయలసీమ జిల్లాలకు కొంతైనా మేలు చేసిన వారు అవుతారని ఆ దిశగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి నీరు అందించేందుకు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని రెడ్డి సంఘము నాయకులు అన్నారు .ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు అమ్మిరెడ్డి చిన్న అంకిరెడ్డి, భూమిరెడ్డిపల్లె వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




