Kadapa: కడపలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి!

Kadapa: కడపలో కృష్ణాష్టమి వేడుకలు ద్వారకానగర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 4 Sept 2026 12:57 PM IST
Kadapa
X

Kadapa: కడపలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి!

Kadapa: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప నగరంలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. ద్వారకా నగర్‌లోని శ్రీకృష్ణుని ఆలయాన్ని సందర్శించిన శ్రీనివాసరెడ్డి గారు, స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

అనంతరం నగరంలోని వై-జంక్షన్ వద్ద గల అష్టలక్ష్మి కళ్యాణ మండపంలో కృష్ణాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ శ్రీకృష్ణుని దివ్య ఆశీస్సులతో కడప ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు మరియు సిరిసంపదలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, స్థానిక భక్తులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story