Lakkireddypalli: కారుతో సహా 6 ఎర్రచందనం దుంగలు సీజ్ చేసిన లక్కిరెడ్డిపల్లి పోలీసులు
Lakkireddypalli: లక్కిరెడ్డిపల్లి వద్ద కర్ణాటకకు ఎర్రచందనం తరలిస్తున్న ముఠా అరెస్ట్. రూ.9 లక్షల విలువైన 6 ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Lakkireddypalli: కారుతో సహా 6 ఎర్రచందనం దుంగలు సీజ్ చేసిన లక్కిరెడ్డిపల్లి పోలీసులు
Lakkireddypalli: ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రానికి ఎర్రచందనం తరలిస్తున్న ముఠాను లక్కిరెడ్డిపల్లి పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.9 లక్షల విలువైన ఆరు ఎర్రచందనం దుంగలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నలుగురు అన్నమయ్య జిల్లాకు చెందినవారు కాగా, ఒకరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
అరెస్టయిన నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ వివరాలు వెల్లడించారు. ఈ దాడిలో లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు, ఎస్‌ఐ శోభ తదితరులు పాల్గొన్నారు.ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




