Rayachoty: రాయచోటిలో వైసిపి ఖాళీ.. టిడిపిలోకి జడ్పీటీసీ రమాదేవి

Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 19 July 2026 10:06 AM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటిలో వైసిపి ఖాళీ.. టిడిపిలోకి జడ్పీటీసీ రమాదేవి

Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. లక్కిరెడ్డిపల్లె మండల జడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ అంబాబత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో సుమారు 150 మంది వైసిపి శ్రేణులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వైసిపిని వీడి టీడీపీలో చేరారు. వీరందరికీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాయచోటి నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా చేస్తామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వేరే పార్టీ జెండా ఎగరనీయకుండా ఒక్క టిడిపి జెండానే ఎగిరేలా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. పాత, కొత్త తేడా లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త టిడిపి బలోపేతం కోసం పని చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి సీఎం చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి టిడిపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story