Rayachoty: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటీఎఫ్ డిమాండ్

Rayachoty: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 27 Aug 2026 9:22 PM IST
Rayachoty
X

Rayachoty: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటీఎఫ్ డిమాండ్

​రాయచోటి: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) రాయచోటి డివిజన్, అన్నమయ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం యూటీఎఫ్ నేతలు కార్యచరణను ప్రకటించారు.

రాయచోటి పట్టణం శివాలయం చెక్ పోస్ట్ నుండి నేతాజీ కూడలి, బస్టాండ్ మీదగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులపై టెట్ భారం మోపడం సరికాదని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TET) పరీక్షను పూర్తిగా రద్దు చేయాలన్నారు.విద్యా హక్కు చట్టం-2009 లోని సెక్షన్ 23(1)కి తగిన సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

నిర్వహించే స్పెషల్ టెట్‌లో అభ్యర్థులందరికీ క్వాలిఫైయింగ్ మార్కులను 40 శాతానికి పరిమితం చేయాలన్నారు.టెట్ పరీక్షలను ఆన్‌లైన్ కాకుండా పాత పద్ధతిలోనే ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలని కోరారు.సబ్జెక్టు ఉపాధ్యాయులకు సంబంధిత సబ్జెక్టుల్లో మాత్రమే పరీక్షలు అమలు చేయాలన్నారు.

తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ అన్నమయ్య జిల్లా, రాయచోటి డివిజన్ నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు....

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story