Rayachoty: మెగా డీఎస్సీపై వైకాపా విషప్రచారం భూక్కే విశ్వనాథ్
Rayachoty: మెగా డీఎస్సీ నియామకాలపై వైకాపా విషప్రచారాన్ని తిప్పికొట్టిన రాయచోటి టీడీపీ నేత భూక్కే విశ్వనాథ్ నాయక్. 5 కీలక అంశాలతో వైఎస్‌ఆర్‌సీపీపై ధ్వజం.
Rayachoty: మెగా డీఎస్సీపై వైకాపా విషప్రచారం భూక్కే విశ్వనాథ్
రాయచోటి: రాయచోటి మెగా DSC నియామకాలపై వైకాపా నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నేత భూక్కే విశ్వనాథ నాయక్ స్పందించారు. ఈ సందర్భంగా విశ్వనాధ్ నాయక్ మాట్లాడుతూ 5 కీలక పాయింట్లతో వైకాపా కుట్రలను తిప్పికొట్టారు.
1. ఉద్యోగాల కోసం కుట్ర చేస్తున్నది ఎవరు?
గత 5 ఏళ్లు DSC నోటిఫికేషనే ఇవ్వకుండా లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది వైకాపా. ఇప్పుడు 16,347 ఉద్యోగాలు ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేస్తే కడుపు మంటతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
2. పారదర్శకత గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా?
2018 DSC లో పేపర్ లీకులు, అక్రమాలు చేసింది మీరే. కూటమి ప్రభుత్వం 100% కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, OMR లేకుండా పూర్తి పారదర్శకంగా నియామకాలు చేపట్టింది. ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు.
3. అర్హులకు అన్యాయమా? మెరిటే ప్రామాణికం
4 లక్షల మంది రాసిన పరీక్షలో కులం, మతం, పార్టీ, డబ్బు చూడకుండా కేవలం మార్కుల ఆధారంగా సెలక్షన్ ఇచ్చాం. ఇదేనా మీకు అన్యాయంగా కనిపిస్తుంది?
4. రోస్టర్, రిజర్వేషన్ల విషయంలో కోర్టుకు ఎక్కిస్తున్నది ఎవరు?*
SC, ST, BC, EWS అందరికీ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చాం. మళ్లీ కోర్టు మెట్లెక్కించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కోర్టులో కూడా మా ప్రభుత్వం గెలిచి తీరుతుంది.
5. చంద్రబాబు గారి కమిట్మెంట్ - మాట ఇస్తే నిలబెట్టుకుంటాం
"100 రోజుల్లో మెగా DSC" అని మాట ఇచ్చాం. నిలబెట్టుకున్నాం. మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల జాబితా ఏది? లేదు. మేము మాట ఇస్తే నిలబెట్టుకుంటాం. మీలా మోసం చేయం.
ఉద్యోగాలు వద్దు, రాజకీయం ముద్దు" అనుకునే వైకాపా కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. లక్షల మంది నిరుద్యోగుల ఆశీర్వాదం కూటమి ప్రభుత్వం వెంట ఉందన్నారు.




