Rayachoty: రాయచోటిలో నీట్ లీకేజీపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు!
Rayachoty: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాయచోటిలో విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి.
Rayachoty: రాయచోటిలో నీట్ లీకేజీపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు!
Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని నేతాజీ సర్కిల్ వద్ద విద్యార్థి సంఘాలు విద్యార్థులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పత్రం లీక్ ఘటనను నిరసిస్తూ శాంతియుత నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో మొత్తం 152 పరీక్ష పేపర్ లు లీక్ అయ్యాయని అందులో గడిచిన ఐదు సంవత్సరాలలో నీట్ పేపర్ మాత్రమే మూడు సార్లు లీక్ అయ్యిందని తెలిపారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అత్యంత తీవ్రమైన విషయం అని తెలిపారు.
తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పులు చేసి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఉన్నత చదువులు చదివిస్తే పరీక్షా పత్రం లీక్ అయినందున తీవ్ర మనస్థాపానికి గురైన దాదాపు 20మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తగిన నష్టపరిహారం ఇచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలవాలని డిమాండ్ చేశారు దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈనెల 20న ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం దురదృష్ట కరమన్నారు విద్యార్థులపై పెట్టిన కేసులను కొట్టివేయాలని గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకులు పరీక్షల నిర్వహణలో లోపాలు పునరావృతం కాకుండా పారదర్శకమైన కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థుల కష్టాన్ని వారి భవిష్యత్తును కాపాడే విధంగా పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు ఏఐఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ ఏ ఎస్ వై ఎఫ్ రమేష్ సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి విశ్వనాధ్ సిపిఐ ఎంఎల్ వ్యవసాయ సంఘం అధ్యక్షులు మండెం సుధీర్ కుమార్ ముస్లిం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాసూం వలి కార్యదర్శి నౌషాద్ సహారా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ అమీర్ అలీ ప్రధాన కార్యదర్శి షేక్ అఫ్తాబ్ ఉపాధ్యక్షులు న్యాయవాది మొగల్ ఇలియాస్ బేగ్ కార్యదర్శి అత్తార్ అజిజుర్ రహిమాన్ గౌస్ జిలాన్ భాష న్యాయవాది ఖాదర్ బాషా అజ్మతుల్లా ఫయాజ్ ముకర్రం విద్యార్థులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.




